ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతడిని పంజాబ్ కింగ్స్ రూ. 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. భారీ హిట్టింగ్ తో పాటు.. ఫాస్ట్ బౌలింగ్ చేయగలగడంతో అతడికి ఈ డిమాండ్ ఏర్పడింది. దీంతో లక్నో సూపర్ జయింట్స్ జట్టులో ఉండాల్సిన స్టోయినీస్.. పంజాబ్ జట్టులో చేరాడు. లక్నో ఈ స్టార్ ఆసీస్ ఆల్ రౌండర్ ను రిటైన్ చేసుకోలేదు. కనీసం అతడి కోసం RTM కార్డు కూడా ఉపయోగించలేదు. స్టోయినీస్ కొనలేకపోవడంపై లక్నో సూపర్ జయింట్స్ సంజీవ్ గోయెంకా తన నిరాశను వ్యక్తం చేశాడు.
సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.."స్టోయినిస్ ఖచ్చితంగా మా ప్లాన్‌లో ఉన్నాడు. అతను 10 నుంచి 10.25 కోట్లలోపు ఉంటే మేము అతని కోసం RTM ఉపయోగించాము. కానీ అతను అంతకు మించిపోయాడు. స్టోయినిస్ మాతో ఉండాలని కోరుకున్నాం. అతడు వేరే జట్టుకు వెళ్లడంతో నిరాశ చెందాం". అని ఆయన అన్నారు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జయింట్స్ తరపున స్టోయినిస్ 14 ఇన్నింగ్స్‌లలో 147.52 స్ట్రైక్ రేట్‌తో 388 పరుగులు చేశాడు. బౌలింగ్ లో సత్తా చాటి 14 ఓవర్లలో 9.00 ఎకానమీ రేట్‌తో నాలుగు వికెట్లు తీశాడు.
Also Read : వెస్టిండీస్ తరపున ఆల్‌టైం రికార్డ్ సెట్ చేసిన బ్రాత్‌వైట్
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ జట్టు వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. అతనికి రూ. 21 కోట్లు ఇచ్చి మొదటి రిటైన్ ప్లేయర్ గా తీసుకున్నారు. మయాంక్ యాదవ్ కు రూ. 11 కోట్లు.. రవి బిష్ణోయ్ రూ. 11 కోట్లు ఇచ్చారు. వీరిద్దరితో పాటు మొహ్సిన్ ఖాన్ రూ.4 కోట్లు.. ఆయుష్ బడోనీలను రూ.4 కోట్లు ఇచ్చి అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ కు నిరాశ తప్పలేదు.
Sanjiv Goenka reveals the reason why LSG didn't use RTM for Marcus Stoinis in the IPL 2025 mega auction. #SanjivGoenka #MarcusStoinis #LSG #IPL #IPLAuction #CricketTwitter pic.twitter.com/A9sCVlIuhn
— InsideSport (@InsideSportIND) December 2, 2024