Sanjiv Goenka: అతనొక నమ్మశక్యం కాని నాయకుడు.. మాజీ కెప్టెన్‌పై సంజీవ్ గోయెంకా ప్రశంసలు

Sanjiv Goenka: అతనొక నమ్మశక్యం కాని నాయకుడు.. మాజీ కెప్టెన్‌పై సంజీవ్ గోయెంకా ప్రశంసలు

లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోని నమ్మశక్యం కాని కెప్టెన్ అని కొనియాడారు. సంజీవ్ గోయెంకా ఫ్రాంచైజీగా ఉన్న జట్టుకు ధోనీ కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2016లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌కు గోయెంకా ఫ్రాంచైజీ కాగా.. ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. 2017 లో కెప్టెన్సీ నుంచి ధోనీని తప్పించి అతని స్థానంలో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా ప్రకటించారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్ ఫ్రాంచైజీగా ఉన్న గోయెంకా ధోనీపై పొగడ్తలు కురిపించాడు. 

ఇటీవల టీఆర్‌ఎస్‌ షోలో పాల్గొన్న గోయెంకా.. ధోనీ గురించి మాట్లాడుతూ.. "ధోనీలాంటి నాయకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అతని ఆలోచన విధానం అద్భుతం. ఈ దశలో కూడా ధోనీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. పతిరానా లాంటి బేబీ బౌలర్‌ని చూడండి. అతడిని ధోనీ ఎక్కడ చూశాడో తెలియదు గానీ అతన్ని తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి బాగా తెలుసు. అతనితో మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను". అని పాడ్ కాస్ట్ లో సంజీవ్ గోయెంకా అన్నారు. 

ALSO READ | Suryansh Shedge: ముంబై జట్టులో సూర్య లాంటి మరొకడు.. ఎవరీ సూర్యంష్ షెడ్గే..?

ప్రస్తుతం ఐపీఎల్ లో సంజీవ్ గోయెంకా లక్నో సూపర్ జయింట్స్ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ ను వదిలేసిన అతను రూ. 27 కోట్ల రూపాయల భారీ ధరకు పంత్ ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆటగాడికి చెలించిన భారీ ధర ఇదే కావడం విశేషం. పంత్ తో పాటు మిల్లర్ లాంటి మ్యాచ్ విన్నర్ ను కొన్నది. రిటైన్ ప్లేయర్ల విషయానికి వస్తే వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. అతనికి రూ. 21 కోట్లు ఇచ్చి మొదటి రిటైన్ ప్లేయర్ గా తీసుకున్నారు. మయాంక్ యాదవ్ కు రూ. 11 కోట్లు.. రవి బిష్ణోయ్ రూ. 11 కోట్లు ఇచ్చారు. వీరిద్దరితో పాటు  మొహ్సిన్ ఖాన్ రూ.4 కోట్లు.. ఆయుష్ బడోనీలను రూ.4 కోట్లు ఇచ్చి అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకుంది.