IPL Retention 2025: వ్యక్తిగత రికార్డ్‌ల కోసం ఆడేవారు అవసరం లేదు: రాహుల్‌పై గొయెంకా సెటైర్

IPL Retention 2025: వ్యక్తిగత రికార్డ్‌ల కోసం ఆడేవారు అవసరం లేదు: రాహుల్‌పై గొయెంకా సెటైర్

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ జట్టు తమ రిటైన్ చేసుకునే ప్లేయర్లను ప్రకటించింది. రిటైన్ లిస్టులో కెప్టెన్ రాహుల్ పేరు పేరు లేకపోవడం రిటెన్షన్ లో అతి పెద్ద సంచలనంగా మారింది. మూడేళ్ళుగా లక్నో జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ పై లక్నో యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. అతన్ని లక్నో జట్టు నుండి విడుదల చేసి బిగ్ షాక్ ఇచ్చింది. ఇది చాలదు అన్నట్టుగా రాహుల్ పై లక్నో ఓనర్ సంజీవ్‌ గొయోంకా రాహుల్‌పై పరోక్షంగా సెటైర్ విసిరాడు. 

ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్‌ గొయెంకా మాట్లాడుతూ.. " జట్టు కోసం గెలవాలనే లక్ష్యంతో ఉన్న ప్లేయర్లనే ఎంపిక చేశాం. వ్యక్తిగత రికార్డ్స్ కోసం ఆడేవారు మా జట్టుకు అవసరం లేదు. మా తొలి రిటెన్షన్‌ నిర్ణయం కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకొన్నాం. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు మొహసిన్‌ ఖాన్‌, ఆయుష్‌ బదోని ఎంపిక చేశాం. 6,7 స్థానాల్లో అతను మాకు బాగా ఉపయోగబడతాడు. పూరన్ ముందు నుంచి మా మైండ్ లో ఉన్నాడు". అని ఆయన తెలిపాడు. 

సంజీవ్‌ గొయెంకా వ్యక్తిగత లక్ష్యాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.  రాహుల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని వారు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ విషయంలో ముందు నుంచి లక్నో అసంతృప్తిగా ఉన్నట్టు  తెలుస్తుంది. అతని స్ట్రైక్ రేట్ చాలా  తక్కువగా ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు 2024 ఐపీఎల్ సమయంలో సన్ రైజర్స్ తో లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత బహిరంగంగానే అందరి ముందు రాహుల్ ను కోపంగా అరుస్తూ సంజీవ్ కనిపించాడు. 

Also Read :- మూడు సార్లు సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. అతనికి రూ. 21 కోట్లు ఇచ్చి మొదటి రిటైన్ ప్లేయర్ గా తీసుకున్నారు. మయాంక్ యాదవ్ కు రూ. 11 కోట్లు.. రవి బిష్ణోయ్ రూ. 11 కోట్లు ఇచ్చారు. వీరిద్దరితో పాటు  మొహ్సిన్ ఖాన్ రూ.4 కోట్లు.. ఆయుష్ బడోనీలను రూ.4 కోట్లు ఇచ్చి అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ కు నిరాశే మిగిలింది.