- బీజేపీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
ఆర్మూర్, సిరికొండ, పిట్లం, వెలుగు : తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని మహారాష్ట్రలోని వాణి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో మంగళవారం బీజేపీ మండల ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కు సంజీవరెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, విజయభారతి, పాలెపు రాజు, రాజేశ్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, నరేష్ చారి, గెంట్యాల పండరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీతోనే దేశాభివృద్ధి
బీజేపీతోనే దేశాభివృద్ది సాధ్యమని అస్సాం రాష్ర్టంలోని నహర్కాతియా ఎమ్మెల్యే తరంగా గోగోయ్ అన్నారు. సిరికొండ మండలంలోని విస్తృత స్థాయి మండల మీటింగ్‌కు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేసి బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు. రూరల్ ఇంచార్జ్ దినేష్, జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి,రామస్వామి,శ్రీనివాస్,రంజీత్ రెడ్డి ,సంజీవ్,తదితరులు ఉన్నారు.
కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంగళవారం పిట్లం సాయిగార్డెన్స్‌లో నిర్వహించిన వర్క్ షాప్‌కు అస్సాం రాష్ట్ర ఎమ్మెల్యే అజయ్‌కుమార్ హజరయ్యారు. ఆయనను బీజేపీ డిస్టిక్ ప్రెసిడెంట్ అరుణతార నియోజకవర్గం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. అరుణతార మాట్లాడుతూ త్వరలో బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో వర్క్ షాప్‌లు ఉంటాయని తెలిపారు. పిట్లం నియోజకవర్గం కన్వీనర్ శ్రీధర్ పంతులు, నియోజకవర్గంలోని ఆరు మండల అధ్యక్షుడు అభినయ్‌రెడ్డి, కిష్టారెడ్డి, శివాజీ పటేల్, బాలాజీ పటేల్, హన్మాండ్లు, ధనుంజయ్ పటేల్ కార్యకర్తలు పాల్గొన్నారు.