IND vs ZIM 2024: జింబాబ్వేతో మూడో టీ20.. అందరి కళ్లు శాంసన్ పైనే

IND vs ZIM 2024: జింబాబ్వేతో మూడో టీ20.. అందరి కళ్లు శాంసన్ పైనే

భారత్, జింబాబ్వే ల మధ్య 5 టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం (జూలై 10) మూడో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు భారత్ కు షాకిస్తే.. రెండో టీ20 లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. సిరీస్ లో కీలకమైన మూడో టీ20 లో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ మరింత బలంగా మారనుంది. వరల్డ్ కప్ జట్టులో ఉన్న ప్లేయర్స్ శివమ్ దూబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ టీమిండియా స్క్వాడ్ లో జట్టులో చేరారు. వీరిలో అందరి దృష్టి సంజు శాంసన్ పైనే నెలకొంది. 

ఐపీఎల్ లో సూపర్ ఫామ్ తో వరల్డ్ కప్ కు సెలక్ట్ అయినా.. ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. రిషబ్ పంత్ ప్రారంభ మ్యాచ్ ల్లో రాణించడంతో చివరి వరకు అతన్నే వికెట్ కీపర్ గా కొనసాగించారు. దీంతో శాంసన్ టోర్నీ మొత్తం బెంచ్ కే పరిమితమయ్యాడు. ఐపీఎల్  తర్వాత తొలి సిరీస్ ఆడనుండడంతో ఈ కేరళ ఆటగాడు ఎలా ఆడతాడనేది ఆసక్తి కలిగిస్తోంది. సోమవారం (జూలై 8) జట్టుతో చేరిన శాంసన్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రేపు జరగనున్న మూడో టీ20 కు సంజుకు తుది జట్టులో స్థానం దక్కడం ఖాయం. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ స్థానంలో అతను కీపింగ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. 

Also Read:లంకతో వన్డేలకు రోహిత్, విరాట్, బుమ్రా దూరం!

తొలి మ్యాచ్ లో జురెల్ 14 బంతులాడి కేవలం 7 పరుగులే చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో జురెల్ స్థానంలో సంజు రావడం దాదాపు ఖాయమైపోయింది. సాయి సుదర్శన్ స్థానంలో దూబే ఆడనున్నాడు. అయితే ఓపెనర్ జైస్వాల్ కు తుది జట్టులో స్థానం దక్కడం అనుమానంగానే మారింది. అభిషేక్ శర్మ, గైక్వాడ్ సూపర్ ఫామ్ లో ఉండడం గిల్ కెప్టెన్ కావడంతో జైస్వాల్ కు తుది జట్టులో స్థానం దక్కడం కష్టంగానే కనిపిస్తుంది.