భారత క్రికెట్ లో మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్ గా సంజు శాంసన్ కి పేరుంది. టాలెంట్ ఉన్నా అడపాదడప అవకాశాలతో సరిపెట్టేస్తున్నారని ఈ కేరళ ఆటగాడిపై చాలా మంది సింపతీ చూపిస్తున్నారు. ఆసియా కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా సెలక్ట్ చేసి మళ్లీ వెనక్కి పంపించేశారు. వరల్డ్ కప్ లో అవకాశం ఇవ్వకపోగా కనీసం ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా సంజు పేరుని పరిగణలోకి తీసుకోలేదు. తిలక్ వర్మ, గైక్వాడ్ లాంటి జూనియర్స్ కి జట్టులోకి వస్తే శాంసన్ కి మాత్రం నిరాశ తప్పట్లేదు.
KBCలో ప్రశ్న.. సంజుకి నో ఛాన్స్
జట్టులో ఎలాగో స్థానం దక్కించుకోలేకపోతున్న సంజు శాంసన్ కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ షోలో నిరాశే ఎదరైంది. ఇక్కడ నిరాశ ఏంటి అనుకుంటున్నారా..?ఈ షోలో అమితాబ్ "వీరిలో ఎవరు టీమిండియా వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు కాదు?" అనే ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. వారిలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, శుభమన్ గిల్ తో పాటు రిషబ్ పంత్ ఉన్నారు. ఈ నలుగురిలో రిషబ్ పంత్ వరల్డ్ కప్ లో లేడు.
దీంతో ఇక్కడ కూడా శాంసన్ పేరుని పరిగణించకుండా అన్యాయం చేసారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కాగా.. సంజు శాంసన్ ఆసియా గేమ్స్ లో కూడా సెలక్ట్ చేయకపోవడం ఆశ్చర్యంగా మారింది. చివరిసారిగా ఆగస్టు లో విండీస్ టూర్ లో సంజు శాంసన్ వన్డే ఆడాడు.
Sanju Samson excluded here also ? pic.twitter.com/uZsma3IMXD
— All About Cricket (@allaboutcric_) September 25, 2023