
చండీఘర్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. లాకీ ఫెర్గుసన్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్ ఓవర్ రెండో బంతిని 144 కి.మీ వేగంతో వేశాడు. ఈ బంతిని కనెక్ట్ చేయడంలో విఫలమైన శాంసన్ శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటి వరకు క్రీజ్ లో కుదురుకున్న శాంసన్ ఔట్ కావడంతో ఒక్కసారిగా కోపానికి గురయ్యాడు. తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ గ్రౌండ్ లోనే బ్యాట్ విసిరేశాడు.
ఈ ఓవర్ లో తొలి బంతికి ఫోర్ కొట్టిన శాంసన్ రెండో బంతికి ఔట్ అయ్యాడు. 26 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. శాంసన్ ఔటైనప్పటికీ జైశ్వాల్ తో కలిసి తొలి వికెట్ కు 10.2 ఓవర్లలోనే 89 పరుగులు జోడించాడు. తొలి మూడు మ్యాచ్ ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన శాంసన్.. కెప్టెన్ గా తన బాధ్యతలను అందుకున్నాడు. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి రెండు ఓడిపోయింది.
►ALSO READ | RR vs PBKS: బ్యాటింగ్లో దుమ్మురేపిన జైశ్వాల్, పరాగ్.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే..మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వీ జైశ్వాల్ పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 67 పరుగులు చేశాడు. చివర్లో రియాన్ పరాగ్ (43 నాటౌట్), హెట్మేయర్ (20), దృవ్ జురెల్ (13 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్సెన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
SANJU SAMSON IS NOT HAPPY FOR THAT MISTAKE pic.twitter.com/LGR4e9BW8K
— SmithianEra (@NivedhM38443) April 5, 2025