SL vs IND 2024: సెంచరీ సరిపోదేమో.. శాంసన్‌కు మరోసారి మొండి చెయ్యి

SL vs IND 2024: సెంచరీ సరిపోదేమో.. శాంసన్‌కు మరోసారి మొండి చెయ్యి

శ్రీలంక సిరీస్ కోసం భారత జట్టును గురువారం (జూలై 18) ప్రకటించారు. లంక ఆతిధ్యమిస్తున్న ఈ టూర్ లో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ టూర్ లో సెలక్షన్ విధానం కొంతమందికి టీమిండియా ప్లేయర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రతిసారిలాగే ఈ సారి సంజు శాంసన్ కు అన్యాయం జరిగిందనే చెప్పాలి. 

శ్రీలంకతో టీ20 సిరీస్ కు అవకాశం ఇచ్చిన సెలక్టర్లు.. వన్డేల్లో మాత్రం పట్టించుకోలేదు. దీంతో మరోసారి ఈ కేరళ స్టార్ ఆటగాడిపై సానుభూతి చూపిస్తున్నారు. శ్రీలంకతో వన్డే జట్టులోకి టీమిండియా స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఈ ద్వయం వన్డేల్లో కనిపించడం ఇదే తొలిసారి. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు.

Also Read:-ఫామ్‌లో ఉన్నా పక్కన పెట్టారు.. ఆ ఒక్కడి కోసం గైక్వాడ్‌కు అన్యాయం

ఇంతవరకు బాగానే ఉన్నా.. సంజు శాంసన్ కు స్క్వాడ్ లో చోటు దక్కలేదు. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మూడో వన్డే ఆడింది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ 80 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో స్థానం పక్కా అనుకుంటున్నా సమయంలో అనూహ్యంగా వేటు పడింది. దూబే, రియాన్ పరాగ్ లకు ఛాన్స్ దక్కిన చోట శాంసన్ కు నిరాశ తప్పలేదు.

దూబే వన్డేలు ఆడి చాలా సంవత్సరాలైంది. మరోవైపు పరాగ్ తొలిసారి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వీరిద్దరిలో ఒకరి స్థానంలో శాంసన్ కు చోటివ్వాల్సిందని అభిమానాలు సెలక్టర్లపై మండిపడుతున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ లుగా జట్టులో రాహుల్, పంత్ ఉండనే ఉన్నారు. ఈ కారణంగానే శాంసన్ కు అవకాశం చోటు దక్కకపోవచ్చు. ఇక ఈ సిరీస్ లో బిగ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను టీ20లకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. వన్డేలకు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ సారథ్యం వహించనున్నాడు.