GT vs RR: వరల్డ్ క్లాస్ బ్యాటర్‌పై శాంసన్ ప్రయోగం.. బట్లర్‌కు టెస్ట్ ఫీల్డ్ సెటప్

GT vs RR: వరల్డ్ క్లాస్ బ్యాటర్‌పై శాంసన్ ప్రయోగం.. బట్లర్‌కు టెస్ట్ ఫీల్డ్ సెటప్

టీ20 క్రికెట్ లో విధ్వంసకర ఆటగాడిగా పేరున్న జోస్ బట్లర్ కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ విచిత్రమైన ఫీల్డింగ్ సెట్ సెట్ చేశాడు. బుధవారం (ఏప్రిల్ 9) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో తొలి స్పెల్ దడ పుట్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికి గిల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఈ దశలో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బట్లర్ కు సంజు శాంసన్ ప్రయోగాత్మక కెప్టెన్సీతో ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ఓవర్ లో బట్లర్ కు రెండు స్లిప్ లు పెట్టడంతో పాటు షార్ట్ లెగ్ లో ఒక ఫీల్డర్ ను సెట్ చేశాడు. దీంతో ఆర్చర్ మరింతగా చెలరేగిపోయాడు. షార్ట్ బాల్స్ వేస్తూ బట్లర్ ను ఇబ్బంది పెట్టాడు. అయితే ఈ ఓవర్ నాలుగో బంతికి బట్లర్.. ఆర్చర్ వేసిన 149 కి.మీ బంతిని కవర్స్ లో బౌండరీ కొట్టడం విశేషం. బట్లర్ ఓవరాల్ గా 25 బంతుల్లో 36 పరుగులు చేసి సాయి సుదర్శన్ తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(53 బంతుల్లో 82: 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీకి తోడు బట్లర్ (36), షారుఖ్ ఖాన్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

►ALSO READ | GT vs RR: బ్యాటింగ్‌లో దంచికొట్టిన గుజరాత్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?