ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శలకు భారత క్రికెటర్ సంజూ శాంసన్ చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఈ భారత వికెట్ కీపర్ చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లోనే శతకం బాది టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఒక్క ప్రదర్శనతో సంజూ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ 91 మందిని వెనక్కినెట్టి కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఈ సిరీస్‌కు ముందు వరకు 156వ స్థానంలో శాంసన్.. ఏకంగా 91 స్థానాలు ఎగబాకి 65వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇదే అతని కెరీర్‌లో అత్యుత్తమ రాంక్. ఇదే సిరీస్‌లో మెరుపులు పెరిపించిన మరో భారత బ్యాటర్ రింకు సింగ్ సైతం 32 స్థానాలు ఎగబాకి 43వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన జైస్వాల్ ఆరో స్థానానికి పడిపోగా.. రుతురాజ్ గైక్వాడ్ 11వ స్థానానికి పడిపోయాడు.
ALSO READ | ENG vs PAK: 8 బంతుల్లో 3 వికెట్లు.. ఇంగ్లండ్‌ను భయపెడుతున్న పాక్ స్పిన్నర్లు
రెండో స్థానంలో సూరీడు
ఈ జాబితాలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(881 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(818 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే, బంగ్లాదేశ్‌తో ఒకే ఒక్క టీ20 ఆడిన రవి బిష్ణోయ్ మళ్లీ టాప్ 10 ర్యాంకింగ్స్‌లోకి వచ్చాడు.
మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు
- 2: సూర్యకుమార్ యాదవ్
- 6. యశస్వి జైస్వాల్
- 11. రుతురాజ్ గైక్వాడ్
- 25. శుభమాన్ గిల్
- 43. రింకూ సింగ్
- 52. హార్దిక్ పాండ్యా
- 54. రోహిత్ శర్మ (రిటైర్డ్)
- 61. విరాట్ కోహ్లీ (రిటైర్డ్)