Sanju Samson: సంజు శాంసన్‌కు సర్జరీ.. ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ టెన్షన్

Sanju Samson: సంజు శాంసన్‌కు సర్జరీ.. ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ టెన్షన్

ఐపీఎల్ కు ముందు రాజస్థాన రాయల్స్ జట్టుకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆ జట్టు కెప్టెన్.. టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌ సర్జరీ చేయించుకోవడమే ఇందుకు కారణం. శాంసన్ ఇటీవలే తన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం బుధవారం (ఫిబ్రవరి 12) తమ అధికారిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. సంజు శాంసన్ త్వరగా  త్వరగా కోలుకోవాలని వారు ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. "త్వరగా కోలుకోండి, కెప్టెన్" అని హార్ట్ ఎమోజీని షేర్ చేశారు.
 
ఐపీఎల్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో టోర్నీ ప్రారంభ సమయానికి శాంసన్ అందుబాటులో ఉంటాడో లేదో అనుమానంగా మారింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే సంజు.. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ లో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉంటున్నాడు. మెగా ఆక్షన్ కు ముందు రూ. 18 కోట్ల రూపాయలను పెట్టి సంజు శాంసన్ ను రిటైన్ చేసుకుంది. టీమిండియా ఫిబ్రవరి 19 నుంచి  జరగబోయే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో సంజు సెలక్ట్ కాలేదు. దీంతో శాంసన్ నేరుగా ఐపీఎల్ ఆడనున్నాడు. 

Also Read :- ట్రోలర్లపై పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ జోకులు

ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో గాయపడ్డాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్  సందర్భంగా అతను గాయపడ్డాడు. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎక్స్‌ప్రెస్ డెలివరీ శాంసన్ చూపుడు వేలికి బలంగా తగిలింది. దీంతో రక్తస్రావం కూడా జరిగింది. ఫిజియో చికిత్స పొందిన తర్వాత సంజు బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తర్వాత ఓవర్లోనే బిగ్ షాట్ కు ప్రయతించి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శాంసన్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.