స్టార్ ఆటగాడిపై వేటు..సంజూకు తుది జట్టులో చోటు దక్కెనా?

స్టార్ ఆటగాడిపై వేటు..సంజూకు తుది జట్టులో చోటు దక్కెనా?

T20 world cup: టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశ ముగిసింది. గ్రూప్ ఏ(Group A) నుండి భారత్,అఫ్ఘానిస్థాన్ జట్లు సెమిస్ కు చేరగా..గ్రూప్ బీ(Group B) నుండి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమిస్ కు చేరాయి. అయితే గురువారం(రేపు) 2024 june 27న ఒకే రోజు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం..మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య ఉదయం 6 గంటలకు జరుగనుంది. తరువాత రాత్రి 8 గంటలకు రెండో సెమిస్ లో ఇంగ్లాండ్, భారత్ జట్లు ఢీ కొనబోతున్నాయి.

బలబలాల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు సమఉజ్జిలుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తిగా నెలకొంది. విజయం సాధించి ఫైనల్ వెళ్ళాలని రెండు జట్లు ఉత్సాహంతో ఉన్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమిఫైనల్ మ్యాచ్ జరగగా..ఒక్క వికెట్ కోల్పోకుండా భారత్ ను ఇంగ్లాండ్ ఘోరంగా ఓడించింది. ఇన్నింగ్స్ లో కేవలం 16 ఓవర్లలోనే టార్గెట్ ఛేసింది ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు కనిపించనున్నాయి.

అది ఏంటంటే..టీ20 వరల్డ్ కప్ లో రవీంద్ర జడేజా నిరాశపరుస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుచుతున్నాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. గయానా పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలిస్తుంది. దీంతో భారీ స్కోర్ నమోదు చేయొచ్చని భారత్ భావిస్తుంది. టీమిండియా కెప్టెన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో మరి వేచిచూడాల్సిందే..