ఆసియా కప్ లో భాగంగా రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజు శాంసన్ ని తాజాగా భారత మేనేజ్ మెంట్ విడుదల చేసింది. టోర్నీ సూపర్ 4 దశకు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్‌కు బ్యాకప్‌గా శాంసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాయం కారణంగా లీగ్ లో తొలి రెండు మ్యాచులు ఆడలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో శాంసన్ అవసరం ఇక లేదని భావించి స్వదేశానికి పంపించేశారు.
దుబాయ్ కి వెళ్లిపోయిన సంజు
అసలే రిజర్వ్ ప్లేయర్ గా సెలక్ట్ చేసి శాంసన్ కి తీవ్ర అన్యాయం చేయడంతో పాటు తాజాగా జట్టులో నుంచి విడుదల చేసి పెద్ద షాక్ ఇచ్చింది యాజమాన్యం. దీంతో ప్రస్తుతం సంజు శ్రీలంక నుండి స్వదేశానికి కాకుండా అటు నుంచి దుబాయ్ కి వెళ్ళిపోయాడు. అక్కడ సరదాగా గడుపుతున్న ఒక ఫోటో వైరల్ గా మారింది. ట్రెండీ లుక్కులో శాంసన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఈ కేరళ బ్యాటర్ వేరే దేశం తరపున ఆడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తనకి దేశం కంటే ఏది ముఖ్యం కాదని తేల్చేసాడు. టాలెంట్ ఉన్నా.. జట్టులో ఇప్పటికీ చోటు దక్కించుకోలేకపోతన్న శాంసన్ నిజంగా దురదృష్టవంతుడే.
Sanju has left Sri Lanka and is currently in Dubai ??#CricketTwitter #india #pakistan pic.twitter.com/iIEPW5TP4f
— InsideSport (@InsideSportIND) September 8, 2023