
హైదరాబాద్, వెలుగు: సంకల్పచంద్ పటేల్ యూనివర్సిటీ హైదరాబాద్లో శుక్రవారం రీజనల్ ఆఫీసును ప్రారంభించింది. దక్షిణాది స్టూడెంట్లకు కెరీర్ కన్సల్టింగ్, ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ సహాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
దక్షిణ రాష్ట్రాల విద్యార్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుందని యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ భాయ్ పటేల్ అన్నారు. కార్యక్రమంలో ఎస్పీయూ ప్రొవోస్ట్ ప్రఫుల్ కుమార్ ఉదానీ, రిజిస్ట్రార్ పరిమల్ త్రివేదీ, ప్రిన్సిపల్ పటేల్ పాల్గొన్నారు.