స్విస్ ఓపెన్ సూపర్ 300లో శంకర్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌ సంచలనం

స్విస్ ఓపెన్ సూపర్ 300లో  శంకర్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌ సంచలనం

బాసెల్‌‌‌‌‌‌‌‌: ఇండియా షట్లర్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌.. స్విస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–300 టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం రాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో శంకర్‌‌‌‌‌‌‌‌ 18–21, 21–12, 21–5తో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ అండెర్స్‌‌‌‌‌‌‌‌ అంటోన్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. 66 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో ఓడినా తర్వాతి రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లో అద్భుతంగా ఆడాడు. ప్రత్యర్థి కొట్టిన ప్రతీ షాట్‌‌‌‌‌‌‌‌ను రిటర్న్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

దీంతో ఒత్తిడికి లోనైన అటోన్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందిపడ్డాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రియాన్షు రజావత్‌‌‌‌‌‌‌‌ 15–21, 17–21తో టోమా జూనియర్‌‌‌‌‌‌‌‌ పొపోవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడాడు.  విమెన్స్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్స్‌‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్‌‌ 21–18, 21–14తో పుయ్‌‌ లామ్‌‌ యెంగ్‌‌–ఎగా టింగ్‌‌ యుయెంగ్‌‌ (హాంకాంగ్‌‌)పై గెలిచి సెమీస్‌‌లోకి అడుగుపెట్టారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో అనుపమ ఉపాధ్యాయ 17–21, 19–21తో పుత్రి కుసుమ వార్డాని (ఇండోనేసియా) చేతిలో ఓడింది.