ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీలకు లేదు : సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట, వెలుగు : ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని సూర్యాపేట నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిన పార్టీలని ఆయన ఆరోపించారు. ఆదివారం ప్రజా సంగ్రామ యాత్ర సూర్యాపేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. 2014 , 2018 శాసన సభ ఎన్నికల్లో రెండుసార్లు కేసీఆర్ మాయమాటలు నమ్మి మోస పోయమన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, నోటిఫికేషన్లు వేసి పరీక్షలు నిర్వహించకుండానే ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఓటమి తధ్యమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, జిల్లా నాయకులు ఉప్పు శ్రీనివాస్, మండల నాయకులు మొండి కత్తి శివాజీ పాల్గొన్నారు. 

ALSO READ : అధికార పార్టీ డబ్బులు వెదజల్లుతోంది: బుడగం శ్రీనివాసరావు