సూర్యాపేట, వెలుగు : రాష్ట్రానికి బీసీ నేత సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని బీజేపీ సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండలంలోని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రశ్నాపత్రాలను లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు.
దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి లాంటి పథకాలు ఎన్నికల కోసం తీసుకొచ్చినవేనని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ సూర్యాపేట సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్న తీరు చూసి ఆ పార్టీ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నేతలు సైదులు, రాంరెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగయ్య, ఎండీ అస్లాం ఉన్నారు.