
సూర్యాపేట, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని, ఆక్రమణదారులను మంత్రి జగదీశ్ రెడ్డి పెంచి పోషించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేసి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఇమాంపేట, జాతోట్ తండా, రాముల తండా, రుప్లా తండా, తాళ్ల ఖమ్మం పహాడ్ గ్రామలలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేటలో ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కదాన్ని సరిగా అమలు చేయని బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -గ్రూప్ వన్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేసి నిరుద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టిందన్నారు. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు సూర్యాపేట జిల్లా అడ్డగా మారిందని ఆరోపించారు.
-తండాల్లో బెల్ట్ షాపులను విపరీతంగా పెంచి పేదల కష్టాన్ని దోసుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డిని ఓడించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్న శశిధర్ రెడ్డి, జిల్లా నాయకులు వెన్న చంద్రారెడ్డి, ఉప్పు శ్రీనివాస్, మండల నాయకులు మొండికత్తి శివాజీ, నాను నాయక్, బోర రమేశ్‌యాదవ్, రేటినేని ప్రవీణ్, గుర్రం గణేశ్‌రెడ్డి, పచ్చిపాల సైదులు, మామిడి వెంకన్న, జ్యోతుల యుగేంధర్, ఆరూరి సురేశ్, తాడూరి రాజు పాల్గొన్నారు.