తెలంగాణలో బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : సంకినేని వెంకటేశ్వర్ రావు

తెలంగాణలో బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట, వెలుగు:  బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ఆ పార్టీ సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లగడ్డ, కోర్టు చౌరస్తా, పాత బస్టాండ్, పోస్ట్‌‌ ఆఫీస్, పూలసెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్‌‌‌‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.

అండర్‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఎక్కడ చేపట్టారో చూపించాలని మంత్రి జగదీశ్‌‌ రెడ్డిని నిలదీశారు. రూ. 7,500 కోట్లతో  సూర్యాపేటను అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెబుతున్న ఆయనకు డ్రైనేజీ గుర్తుకు రాలేదా.. ? అని ప్రశ్నించారు. గతంలో పట్టణ ప్రజలు, వ్యాపారులను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి  దామోదర్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు.  దళితుల భూములను గుంజుకొని సూర్యాపేట నయీంగా పేరు తెచ్చుకున్న వట్టె జానయ్య యాదవ్ బహుజనవాదం ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.  

ALSO READ : న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా : బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి మల్లయ్య

బీజేపీకి ఓటేస్తే బీపీ వ్యక్తి సీఎం అవుతారని,  డ్వాక్రా మహిళలకు 8 పైసల వడ్డికే రుణాలు, ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు, రైతులకు సబ్సిడీపై ఎరువులు,  వరి ధాన్యానికి 3,100  మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు.  అంతకుముందు 29 వార్డుకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు  వైఎస్ఆర్టీపీ చివేముల మండల అధ్యక్షుడు మోగ వెంకట్ రెడ్డి, యర్కారం గ్రామం దుబ్బ తండాకు చెందిన 20 మంది యువకులు బీజేపీలో చేరారు.