మరో నయీమ్‌లా మంత్రి : సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు :  మంత్రి జగదీశ్‌ రెడ్డి  మరో నయీమ్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు  ఆరోపించారు. సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక సూర్యాపేటలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు.  మున్సిపల్‌ చైర్మన్‌ పదవి అమ్ముకున్నారని, ఇందుకోసం  8 మంది వద్ద డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.  

మంత్రి అండతోనే ఖమ్మం-–సూర్యాపేట హైవే వెంట ఉన్న భూములను చివ్వెంల జడ్పీటీసీ కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అంతేకాదు రైతులపైనే కేసులు పెడుతున్నారని, అడ్డుకోవాల్సిన ఎస్సై కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు కర్నాటి కిషన్, సలిగంటి వీరేంద్ర, మన్మదరెడ్డి, మీర్‌అక్బర్, శ్రీను, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.