సంక్రాంతి వేడుకంతా రైతుదే

పంట చేతికొచ్చిన తర్వాత జరుపుకునే పండుగ సంక్రాంతి. తన ధాన్య సిరి చూసి రైతు మురిసిపోతూ.. సంతోషంగా తన కుటుంబంతో జరుపుకునే పండుగ. అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే దేశం కూడా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తూ అందరూ కలిసి జరుపుకునే పండుగే సంక్రాంతి. ముగ్గుల వాకిలిలో, కొత్త రుచులతో ఘుమఘుమలాడే లోగిలిలో మకరరాశి వెలుగుల్లో  ఎగిరే పతంగుల్లా సంతోషాల్లో  తేలిపోయే సంబురం ఇది.

కొత్త సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి. ఇది జానపదుల పండుగ. కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయంలో చేసుకునే సంబురం. అన్నింటికి మించి పర్యావరణాన్ని పూజించుకునే వేడుక.  గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, అమ్మాయిల గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ళ రాకతో ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి.

ఆచారం… ఆరోగ్యం

మకర సంక్రాం-తిని ‘పంటకోతల పండుగ’,  ‘కుప్ప నూర్పి-డుల పండుగ’ అని కూడా పిలుస్తారు. పంట ఇంటికి వచ్చిన తర్వాత, మళ్లీ కొత్త పంట వే-యడానికి కావాల్సినవి సిద్ధం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఈ పండుగలో ఉంది. ఇక, ‘క్రాంతి’ అంటే వెలుగు, అభివృద్ధి అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘సం’ అంటే చేరుకో-వడం. సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడమే. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో కి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఈ రోజును పవిత్ర పుణ్య దినంగా భావిస్తారు. ఈ పుణ్య ఘడియలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉంటాయి. ఈ రోజు కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. మకరరాశికి అధిపతి శని. అందుకే ఈ రోజు శనికి ప్రీతికరమైన నల్లనువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, గుమ్మడికా-యలు దానం చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం , సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.  నువ్వులు, బెల్లం తినడం వల్ల వ్యాధినిరో-ధక శక్తి పెరుగుతుంది. ఈ రోజున ఏ దైవాన్ని పూజించినా, యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు కూడా వదులుతారు.

మకరం.. పురాణం

మకర సంక్రాం-తిలో ‘మకరం’ అంటే ‘మొసలి’ అని అర్థం . నీళ్లలో మొసలి పట్టుకుంటే వదలదు.  సుఖాలకు అలవాటు పడిన మనిషి మొసలి నోటిలో చిక్కుకున్న- వాడితో సమానం. దాని తాలూకు బాధల నుంచి తప్పించుకోలేడు. అందుకే, సంక్రాంతి రోజు గుడికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తారు.  కొందరు ఉపవాసం ఉంటారు. అలాగే ఈ పండుగకు సూర్యుడికి సంబంధం ఉంది. పురాణాల ప్రకారం సూర్యుడు ఇంద్ర, వరుణ, వాయుదేవతల సాయంతో వర్షాలు కురిపిస్తాడు. అందుకే ఈ రోజు పొంగలిని సూర్యుడికి నై-వేద్యంగా పెడతారు. నీళ్లతో సూర్యుడికి నివేదన కూడా ఇస్తారు.

పండుగ సందేశం

సంక్రాంతి రోజు సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెడతాడు. మకర రాశికి శని అధి-ష్ఠాన దేవత. వరుసకి సూర్యుడు, శని తండ్రీకొడుకులు. అయితే వాళ్లిద్దరికి అసలు పడదు. కానీ, ఈ పండుగరోజు కలుస్తారు. అందుకే సంక్రాంతి పండుగని శత్రువులు, మిత్రులు అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకోవాలని పెద్దలు చెప్తారు. అలాగే సంక్రాంతి ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. ‘శంకర’ అంటే కదలిక అనే అర్థం.  ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుంది. గ్రహాల కదలిక వల్లే సృష్టి నడుస్తుంది.  భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుం-ది.  మనిషి కూడా ఎప్పుడూ కదలిక లేకుండా నిశ్చలంగా ఉండిపోకూడ-దు. జీవి కదలిక ఉత్సవం లాంటిదని చెప్పడ-మే ఈ సంక్రాంతి పండుగ ఇచ్చే సందేశం.  ప్రస్తుతం మనుషుల జీవితాల్లో ఏదో ఒక ఆందోళన సాధారణం అయిపోయింది. జీవితంలో చిన్న మార్పు వచ్చినా తట్టుకునే శక్తి ఉండటం లేదు. శారీరక, మానసిక రోగాల బారిన పడుతున్నా రు. మనసు, శరీరాల్లో కదలిక లేకుండా ఉండే  కన్నా, ఎప్పటికప్పుడు మార్పును తీసుకోగలగాలని ఈ పండుగ మనకు చెప్తుంది.

గంగిరెద్దులు

సంక్రాంతి పండుగలో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకత గంగిరెద్దులు. వీటిని ఆడించేవాళ్లు గంగిరెద్దులతో  వీధుల్లో తిరుగుతూ, డోలు, సన్నాయి వాయిస్తారు. అందుకు అనుకూలంగా గంగిరెద్దులతో  ఆటలు ఆడిస్తారు.  మోకాళ్ల మీద వంగి, వాళ్ల గుండెలపై కాళ్లు పెట్టి గంగిరెద్దులు ఆడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ‘అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు’ అని వాళ్లు చెప్తుంటే ఎద్దులు చేసే  విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఎద్దుల మోపురాన్ని శివలింగంలా భావిస్తారు. దానిని రంగురంగుల దుస్తులతో అలం-కరిస్తారు. కాళ్లకు గజ్జెలు కడతారు. ఈ పండుగరోజు గంగిరెద్దులు ఇంటి ముందుకు వచ్చి నిలబడటాన్ని జానపదులు శుభంగా  భావిస్తారు. వ్యవసాయానికి ఆధారమైన ఎద్దుకు సంతోషంగా కానుకలు ఇస్తారు. కానీ,  ప్రస్తుతం సిటీల్లోనే కాదు గ్రామాల్లోనూ గంగిరెద్దులను ఆడించే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు జనవరి మొత్తం  కనిపించే వాళ్లు, ఇప్పుడు  పండుగ మూడు రోజుల్లో కూడా  అక్కడక్కడ కనిపిస్తున్నారు.

హరిదాసులు

ముఖం మీద తిరునామాలు. కాళ్లకు గజ్జెలు. చేతిలో చిడతలు, నెత్తిమీద రాగితో చేసిన పాత్ర పెట్టుకొని సంక్రాంతికి హరిదాసులు తిరుగుతుంటారు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసుని విష్ణుమూర్తిగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నె భూమికి ప్రతీక. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని, ఎక్కువ, తక్కువనే తేడా లేకుండా అందరూ సమానమని హరిదాసు కీర్తనలు పాడతాడు.