చివరి ఘట్టానికి చేరిన సంక్రాంతి సంబురాలు

చివరి ఘట్టానికి చేరిన సంక్రాంతి సంబురాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
     

సంక్రాంతి సంబురాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. మూడు రోజుల పండుగలో ఇవాళ చివరి రోజు కనుమను ఘనంగా చేసుకుంటున్నారు జనం. కనుమ రోజు... వ్యవసాయంలో ప్రధానంగా సహాయపడే పశువులకు పూజలు చేస్తారు అన్నదాతలు. ఆవులు, ఎద్దులను అందంగా అలంకరిస్తారు రైతులు. పశువుల పాకలను, కొట్టాలను శుభ్రం చేస్తారు. చాలా ఏరియాల్లో అందంగా అలంకరించిన పశువులను గ్రామాల్లో ఊరేగించారు. పంట పొలాల దగ్గర కూడా పూజలు చేస్తారు. కొన్నిచోట్ల ఎద్దుల బండ లాగుడు పోటీలు, పశు ప్రదర్శనలు నిర్వహించారు. 
సంప్రదాయబద్దంగా సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో సంక్రాంతిని అతి పెద్ద పండుగగా చేసుకుంటారు. కొత్త పంట ఇంటి కొచ్చిన ఆనందంలో రైతులు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కోడి పందేలు పండుగకే స్పెషల్. కొబ్బరి, మామిడి తోటల్లో పెద్ద, పెద్ద బరులు ఏర్పాటు చేసి... కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను చూసేందుకు ఏపీతో పాటు... తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి కూడా చాలా మంది వెళ్లారు. ఈ 3 రోజుల్లో కోడి పందేల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారతాయంటే.... పందేలు ఏ రేంజ్ లో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బరుల్లో గుండాట, జూదం కామన్ గా ఉంటాయి. కోడి పందేలపై ఆంక్షలున్నా.... వాటిని లైట్ తీసుకున్నారు నిర్వాహకులు. సంప్రదాయం పేరుతో పండుగ చేసుకుంటున్నామని చెప్తారు స్థానికులు. 

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. పండుగ సరదా

బేగంబజార్ లో నైట్ కైట్ ఫెస్టివల్

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు