సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణాల్లో ఉంటే ప్రజలు సొంతూర్లకు చేరుతున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండే ఆంధ్రప్రదేశ్ తోపాటు, తెలంగాణలో ఉండే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సొంత గ్రామాలకు చేరుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. హైదరాబాద్ విజయవాడ రూట్ లో అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీ ఎత్తున్న నిలిచిపోయాయి. సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి కోదాడ, హుజూర్ నగర్, ఖమ్మం వాసులతోపాటు ఏపీలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సొంతూర్లకు వెళతుండటంతో టోల్ బూత్ వద్ద రద్దీ ఏర్పడింది.
కొర్లపాడు వద్ద మొత్తం 12 బూతులుండగా.. విజయవాడ వైపు 8టోల్ బూత్ లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ప్లాజా వద్ద ఓ అంబులెన్స్, క్రేన్ ను అందుబాటులో ఉంచామని టోల్ సిబ్బంది తెలిపారు.
పెద్ద అంబర్ పేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందలాది వాహనాలు ఔటర్ పై నిలిచిపోయాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫాస్టాగ్ రీచార్జీలు చేసుకొని వారి చెల్లింపుల క్రమంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో పెరిగిన వాహనాలదారులు ఇబ్బందులు పడుతున్నారు.
శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది.. పెద్ద అంబర్ పేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచే ప్రజలు కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, కకినాడ, ఒంగోలు, నెల్లూరు వెళ్లే వాహనాలతో భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు .. ట్రాఫిక్ క్లియరెన్స్ కు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను ముందు కు వెళ్లేలా చర్యలు చేపట్టారు.