పోటీ అంటే ఇరువురు తలబడాల్సిందే.. అది మనుషుల మధ్య అయినా.. జంతువుల మధ్య అయినా.. ఆఖరికి పక్షుల మధ్య అయినా. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే పోటీలో కాలు కదపకుండా, కత్తి దుయ్యకుండా పందెంలో గెలిచింది.. ఓ కోడి పుంజు. అదెలాగో తెలియాలంటే ఇది చదవాల్సిందే..
సంక్రాంతి అనగానే తెలుగువారికి ముఖ్యంగా ఆంధ్ర వారికి గుర్తొచ్చేది కోడిపందాలు. ప్రతి ఏటా పొరుగు రాష్ట్రంలో కోడి పందాల పేరుతో కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా ఏపీలో భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించారు. అదృష్టం తలుపుతట్టినోళ్లు నిమిషాల వ్యవధిలో లక్షలు సంపాదించగా.. లక్ష్మి కటాక్షం పొందని వారు తెచ్చినదంతా పోగొట్టుకొని నిరాశతో ఇంటిబాట పట్టారు. ఈ కోడి పందాల్లో ఒక కోడి పుంజు విజయం సాధించిన తీరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం.. ఆ కోడి పుంజు నిల్చొన్న చోటనే విజయం సాధించడమే.
ఒక్కొక్క కోడికి రూ.25 లక్షల చొప్పున.. ఒక బరిలో ఐదు కోళ్లు తలపడ్డాయి. ఇందులో ఒక కోడి మాత్రం కనీసం కత్తిరువ్వకుండానే.. గాల్లోకి ఎగరకుండానే విజేతగా నిలిచింది. మొదట రెండు కోళ్లు తలపడగా.. ఒకటి నెలకొరిగొంది. అనంతరం మరో రెండు కోళ్లు పోటీపడగా.. ఒకటి పారిపోయింది. ఇక మిగిలింది.. మూడే కోళ్లు. పోరు రసవత్తరంగా ఉంటుందనకుంటే.. మిగిలిన మూడింటిలో రెండు కొట్టుకొని చచ్చిపోయాయి. చివరికి సైలెంట్ గా నిలబడి ఉన్న కోడి గెలిచింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ డైలాగులు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు.
ఏం చేయకుండా గెలిచిన కోడి...
— Ram Rahim Robert (CBN FAMILY) (@bobbysairam) January 15, 2025
ఐదు కోళ్ల మధ్య పందెం పెట్టారు నాలుగు కోళ్లు కొట్టుకొని చచ్చిపోయాయి...
చివరికి సైలెంట్ గా నిలబడిన కోడి గెలిచింది...
నేటి సమాజంలో వితండవాదం చేసే కంటే మౌనంగా ఉంటే మంచిది. pic.twitter.com/qHqVm2tUW8