సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. చుక్కల ముగ్గు, డిజైన్ ముగ్గు అంటూ రకరకాల ముగ్గులు వేస్తూ వాటిని రంగులతో అలంకరిస్తుంటారు. అయితే, ఆ ముగ్గులతో సమాజాన్ని ఆలోచింపజేసేవాళ్లు చాలా తక్కువ. అలాంటి ముగ్గు వేసి అందరి ప్రశంసలు అందుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లా, అలంకానిపేట్ గ్రామానికి చెందిన నూనెముంతల సహస్ర.
ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ సేవ్ గర్ల్ చైల్డ్ మోటోతో వేసిన ఈ ముగ్గు అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో.. వరకట్నం తీసుకోవద్దని, ఆడవాళ్లపై దాడులు, రేప్ లు ఆపాలని, బాలిక విద్య ప్రోత్సహించాలని, శిశు మరణాలు ప్రోత్సహించొద్దని వివరిస్తూ బొమ్మలతో ముగ్గు వేసింది.