Sankranthiki Vasthunam: చరిత్ర సృష్టించిన వెంకీ మామ.. ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్

Sankranthiki Vasthunam: చరిత్ర సృష్టించిన వెంకీ మామ.. ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్

దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరో వెంకటేష్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు. పొంగల్ స్పెషల్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. జనవరి 14న రిలీజైన ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ క్లబ్‌లో చేరింది.ఈ మేరకు తాజాగా జనవరి 20న మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం వెంకటేష్ కెరీర్లోనే అత్యధికం.

ALSO READ | Sankranthiki vasthunam Day 5 Collections: 5 రోజుల్లో రూ.161 కోట్లు కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం... దిల్ రాజు బ్రదర్స్ సేఫ్..

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను సంక్రాంతికి వస్తున్నాం అద్దిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఇప్పటివరకు నార్త్‌ అమెరికాలో 2.1 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్ల వసూళ్లతో కొనసాగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వచ్చిన అనిల్ అండ్ వెంకీ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఈ మూవీ ఆరో రోజు (ఆదివారం) ఏపీ, తెలంగాణల్లో రూ.12.5 కోట్లు నెట్ వసూలు చేసింది. 

ఆరో రోజు షేర్ విషయానికి వస్తే..

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లోనే ఆరో రోజు రూ.12.5 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో రూ.4.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.0.73 కోట్లు, కృష్ణాలో రూ.0.93 కోట్లు, నెల్లూరులో రూ.0.39 కోట్లు, గుంటూరులో రూ.0.89 కోట్లు, వైజాగ్ లో రూ.2.18 కోట్లు, సీడెడ్ లో రూ.2.14 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.16.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ సాధించడం విశేషం.