
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను థియేటర్లలలో ఆదరించిన ప్రేక్షకులు సైతం మళ్ళీ మళ్ళీ చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వచ్చే కామెడీ & ఫ్యామిలీ సీన్లకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఓటీటీ అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తూ వచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ:
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ మరియు టెలివిజన్ హక్కులని జీ5 సంస్థ కొనుగోలు చేసింది. తాజాగా (ఫిబ్రవరి 27న) ఈ బ్లాక్ బాస్టర్ మూవీ ఓటీటీ & టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు టెలివిజన్‌లో ప్రసారం కానున్న ఈ సినిమాను, ఓటీటీలో కూడా అదే రోజు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
Participate in the #SankranthikiVasthunnam Call & Win Contest and win amazing gifts 🎁
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 27, 2025
Watch #SankranthikiVasthunnam This Saturday 6PM, Only On #ZeeTelugu ✨#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV… pic.twitter.com/CROHYSz9df
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. మాములుగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తాయి. ఇంకా ఆ తర్వాత టెలివిజన్ లో ప్రసారమవుతుంటాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇందుకు భిన్నంగా ఒకేసారి టెలివిజన్ తో పాటు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
కామెడీ & ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి రూ.300 కోట్లు పైగా కలెక్ట్ చేసి వెంకీమామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో ఆల్ టైమ్ హైయెస్ట్ రీజినల్ గ్రాసర్‌గా నిలిచింది.
ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి నటించారు. నరేష్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, విటివి గణేష్, బబ్లూ పృథివీరాజ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read:-మజాకా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఇదే!
ప్రముఖ డైరీక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలసి సంయుక్తంగా నిర్మించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సాంగ్స్, బీజీయం అందించాడు.