ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి వచ్చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం.. కారణం అదేనా.?

ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి వచ్చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం.. కారణం అదేనా.?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కామెడీ & ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి రూ.300 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. దీంతో వెంకీమామ కెరీర్ లో  బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమేకాకుండా  టాలీవుడ్‌లో ఆల్ టైమ్ హైయెస్ట్ రీజినల్ గ్రాసర్‌గా నిలిచింది.  OTT ప్రీమియర్స్ ఆలస్యం కావడం వల్ల మంచి లాంగ్ రన్ ఏర్పడింది. దీంతో కలెక్షన్లు తగ్గలేదు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. మాములుగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఓటీటీలోకి టెలివిజన్ లో ప్రసారమవుతుంటాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇందుకు భిన్నంగా మొదటగా టెలివిజన్ లోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ మరియు టెలివిజన్ హక్కులని జీ5 సంస్థ కొనుక్కుంది. దీంతో జీ5 మొదటగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని టెలివిజన్ ఛానెల్ లో ప్రసారం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. 

ఈమధ్య కంటెంట్ ప్రొటెక్షన్ లేకపోవడంతో కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే కొందరు పైరసీ ప్రింట్ ని డౌన్ లోడ్ చేసి ఇంటర్ నెట్లో లీక్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలోని వ్యూస్ కి చిల్లు పడుతోంది. అంతేకాకుండా కోట్లు వెచ్చించి కొన్న సినిమాలకి సబ్ స్క్రిప్షన్స్ పెరగకపోగా వ్యూస్ కూడా రావడం లేదు. దీంతో బుల్లితెర ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు జీ5 ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కి జోడీగా ప్రముఖ హీరోయిన్లు  ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి నటించారు. నరేష్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, విటివి గణేష్, బబ్లూ పృథివీరాజ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ డైరీక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలసి సంయుక్తంగా నిర్మించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్  భీమ్స్ సిసిరోలియో సాంగ్స్, బీజీయం అందించాడు.