SankrantikiVastunnam : ఫన్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్

SankrantikiVastunnam : ఫన్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్

వెంకటేష్  హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన  చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.  మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్​ హీరోయిన్స్‌‌.  దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.  జనవరి 14న సినిమా విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిజామాబాద్‌‌లో నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే  సూర్యనారాయణ  అతిథిగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.  వెంకటేష్  మాట్లాడుతూ ‘కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా ఉంటుంది. 

కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్‌‌ ఆఫ్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌.. అద్భుతమైన పాటలు, డైలాగ్స్, యాక్షన్‌‌తో అనిల్‌‌ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్‌‌‌‌లో ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ హిట్స్. ఇది కూడా మెప్పిస్తుంది.  మాతో పాటు సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.‘ట్రైలర్‌‌‌‌లో చూసింది కొంతే.. ఇంకా చూడాల్సింది చాలా ఉంది’ అని మీనాక్షి చౌదరి అంది. 

తాను పోషించిన భాగ్యం పాత్ర అందరికీ నచ్చుతుందని చెప్పింది ఐశ్వర్య రాజేష్.  అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఇదొక టిపికల్ జానర్. భార్యకు, మాజీ  ప్రేయసికి మధ్యలో నలిగిపోయే పాత్రలో వెంకటేష్ గారు అద్భుతంగా నటించారు. చాలా ట్విస్టులు, టర్న్స్ ఉంటాయి. పండక్కి కచ్చితంగా పెద్ద హిట్ కొట్టబోతున్నాం’ అని చెప్పాడు.  తమ బ్యానర్‌‌‌‌కు ఇది బ్లాక్ బస్టర్ పొంగల్ అని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్​ అన్నారు. నటులు నరేష్, ఎడిటర్ తమ్మిరాజు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.