SankranthikiVasthunnam: వెంకటేష్ అఖండ విజయం.. బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్తో దూసుకెళ్తోన్న సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ సక్సెస్ అందుకున్నాడు. 2025 సంక్రాంతి సినిమాల బరిలో విజేతగా నిలిచాడు. ఈ మూవీ రిలీజైన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.131 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ అధికారికంగా బాక్సాఫీస్ వసూళ్లు ప్రకటించారు.

"సంక్రాంతికి వస్తున్నాం మూవీ 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.131 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రేక్షకులు ఈ పండుగ సీజన్‌లో తమకు ఇష్టమైన సినిమాతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు" అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఇప్పటికీ ఈ మూవీ రూ.75కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఐదవ రోజు నాటికి రూ.150 కోట్ల మార్కును దాటే దిశగా దూసుకెళ్తోంది.

నిజానికి సంక్రాంతి సినిమాల్లో అత్యధిక బజ్, భారీ బడ్జెట్, అంతకంటే భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు ఉన్నాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఎలాంటి అంచనాలు కూడా వాటిని మించి లేవు. కానీ, మేకర్స్ చేసిన ప్రమోషన్స్, రీల్స్, వెంకీ స్టేజ్ పెర్ఫార్మన్స్.. ఇలా ప్రతిదీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించాయి. గతేడాది సైంధవ్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న వెంకటేష్.. ఈ 2025 సంక్రాంతితో విక్టరీ సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికీ అన్నీ ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కళకలాడుతోంది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే, ఈ మూవీ రూ.42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకి పైగా వసూళ్లు చేయడం విశేషం.