SankranthikiVasthunam: బాక్సాఫీస్కి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన విక్టరీ.. సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు

SankranthikiVasthunam: బాక్సాఫీస్కి సరికొత్త  బెంచ్‌మార్క్ సెట్ చేసిన విక్టరీ.. సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో చరిత్ర లిఖించే విజయం సాధించారు. ఎందుకంటే, చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభం పొందే సినిమా తీసి సక్సెస్ అయ్యారు.

లేటెస్ట్ గా  ఈ మూవీ మరో మైల్ స్టోన్ చేరుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు (ఫిబ్రవరి 3న) మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ X లో పోస్ట్ చేశారు. 

"చరిత్రకు కొత్త పేరు! లెగసీకి కొత్త బెంచ్‌మార్క్! సంక్రాంతికి వస్తున్నాం రికార్డు సృష్టించే రాంపేజ్‌తో అత్యున్నత స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లకు పైగా గ్రాస్  వసూళ్లు చేసి.. బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఒక ప్రాంతీయ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ " అంటూ మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ రూ.173.1 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ | Theatre Releases: ఈ వారం (Feb ఫస్ట్‌వీక్‌) థియేటర్లలోకి రానున్న 5 ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇవే

దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరో వెంకటేష్ ఈ సినిమాతో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు. పొంగల్ స్పెషల్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. జనవరి 14న రిలీజైన ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ క్లబ్‌లో చేరింది. 20 రోజుల్లో రూ.173.1 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసి సత్తా చాటింది. ఈ వసూళ్లు ఎంత వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి. 

ఇక ఇప్పుడు రిలీజైన 20 రోజుల్లో ఒక ప్రాంతీయ చిత్రం మూడొందల కోట్ల గ్రాస్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ ఘనత విక్టరీ వెంకటేష్ సాధించడం టాలీవుడ్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకి ఊపిరి పోసింది. అంతేకాకుండా ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీటింగ్ తో మీడియా ముందుకు వచ్చారంటే.. ఇక అర్ధం చేసుకోవొచ్చు సినిమా సక్సెస్ స్థాయి ఏంటనేది.