మరోసారి స్టెప్పులేసేయండి: ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

మరోసారి స్టెప్పులేసేయండి: ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో చరిత్ర లిఖించే విజయం సాధించారు. ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజై అఖండమైన వసూళ్లు సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. అలాగే దాదాపు రూ.178.95 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. 

అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మొదటి నుంచి ఏదైనా పాజిటివ్ వైబ్  ఉందంటే అదొక్క సంగీతమే. ఈ సినిమాకు పాటలుప్రాణం పోశాయి. అందుకు 'గోదారి గట్టు మీద రామచిలకవే' సాంగ్ విజయానికి ఊపిరిగా నిలిచింది. ఈ సాంగ్ కి ఫిదా అవ్వని ఆడియన్ ఉండరు. ఫ్యామిలీ కపూల్స్ ఉండరు. అంతలా సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ గోదారి గట్టు పాట. తాజాగా ఈ రొమాంటిక్ మెలోడీ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘గోదారి గట్టుమీద రామ చిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే’ అంటూ సాగే ఈ  మెలోడీ గీతం సోషల్ మీడియా ఆడియన్స్ ను షేక్ చేసింది. ఒక పాట అనంతమైన భావాలు పలికించడం అంటే.. అది ఈ మాయా మెలోడీ గోదారిగట్టుకే సొంతం.

ఈ పాటని అనుకరిస్తూ డ్యాన్స్ చేయని కపుల్స్ ఉండరంటే నమ్మలేని విధంగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెంకీ, ఐశ్వర్యల రోమాంటిక్‌ మెలోడీకి అందరు ఫిదా అయ్యారు సుమా! ఇక ఆలస్యం ఎందుకు ఫుల్ సాంగ్ చూస్తూ మరోసారి స్టెప్పులేసేయండి.

ఈ మెలొడీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. భాస్కరభట్ల సాహిత్యమందించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీనియర్ సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల ఈ సాంగ్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఫోక్ సింగ‌ర్ మ‌ధుప్రియతో క‌లిసి ర‌మ‌ణ గోగుల ఈ పాటను తనదైన మార్క్ తో పాడారు.