Sankranthiki Vasthunnam: ఓటీటీకి రాకముందే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం.. ప్రసారం ఎక్కడంటే?

Sankranthiki Vasthunnam: ఓటీటీకి రాకముందే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం.. ప్రసారం ఎక్కడంటే?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి భారీ బ్లాక్‍బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ చరిత్ర లిఖించే విజయం సాధించారు. జనవరి 14న థియేటర్లలలో దుమ్మురేపిన ఈ మూవీ త్వరలో టీవీల్లో ప్రసారం కానుంది. అదేంటీ? ఓటీటీకి రాకముందే టీవీల్లో ప్రసారం ఏంటనీ అనుకుంటున్నారా? అదే ఇపుడు ఆసక్తిగా మారింది.

లేటెస్ట్ గా జీ తెలుగు యాజమాన్యం టెలివిజన్ ప్రీమియర్గా సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది అంటూ అధికారికంగా X వేదికగా  ప్రకటించింది. "సంక్రాంతి వైబ్‌ని మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి సిద్ధంగా ఉండండి.. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ సంక్రాంతికి వస్తున్నాం త్వరలో జీ తెలుగులో" అంటూ ప్రీమియర్ వివరాలు వెల్లడించింది.

అయితే, టీవీల్లో ప్రసారం ఎప్పుడు కానుందో మాత్రం డేట్ రివీల్ చేయలేదు. త్వరలో ప్రసార తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక అన్నీ కుదిరితే ఫిబ్రవరి 20నుంచి టీవీల్లో సందడి షురూ కానుందని సమాచారం.

అయితే, ఈ సినిమా ఓటీటీకి రాకుముందే టీవీల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, జీ తెలుగు యాజమాన్యం X లో ఇచ్చిన ట్యాగ్స్ చూస్తుంటే ఆరాధమవుతుంది. TVbeforeOTT, FirstTVloVasthunnam అంటూ ట్యాగ్స్ ఇచ్చింది. దీంతో ఓటీటీకి రాకముందే టీవీల్లో ప్రసారం కానున్న ఫస్ట్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచే అవకాశం ఉంది.

ALSO READ | Dhanush: దర్శకుడిగా ధనుష్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ట్రైలర్ తోనే సినిమా చూపించాడు మామ

ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజై అఖండమైన వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. అలాగే దాదాపు రూ.178.95 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టింది.

తెలుగులో రీజనల్ చిత్రంగా రిలీజై రూ.300కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. తెలుగు ప్రాంతీయ చిత్రాల్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్ తలెత్తుకునేలా చేసింది. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సినిమాతోనే వెంకటేష్ ఫస్ట్ టైం రూ.200కోట్లు, రూ.300 కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టారు. రూ.50కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టీవీ ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూడాలి.