Sankranthiki Vasthunnam: నైజాంలో సంక్రాంతికి వస్తున్నాం సంచలనం.. ఏకంగా 4 రెట్ల లాభాలు

Sankranthiki Vasthunnam: నైజాంలో సంక్రాంతికి వస్తున్నాం సంచలనం.. ఏకంగా 4 రెట్ల లాభాలు

విక్టరీ వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) మూవీతో చరిత్ర లిఖించే విజయం సాధించారు. ఎందుకంటే, చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభం పొందే సినిమా తీసి సక్సెస్ అయ్యారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం 20 రోజుల్లోగానే రూ.303 కోట్లు సాధించి అదరగొట్టేసింది. ఇప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నైజాం ఏరియాలో (Nizam Area) అద్భుతమైన వసూళ్లు రాబట్టిందంట. 

తెలుగు రాష్ట్రాల్లోనే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ఓ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు నైజాం ఏరియాలో రూ.41కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

అయితే, ఈ మూవీ నైజాంలో 8.50 కోట్ల బిజినెస్ చేసింది. అంటే, దాదాపు 32 కోట్లకి పైగా లాభాలను రాబట్టి అద్భుత విజయం సొంతం చేసుకుంది. అంటే, ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే, 4 రేట్ల లాభాలను పొందింది అన్నమాట.

ALSO READ | Prabhas Sai Pallavi: డార్లింగ్ ఫ్యాన్స్కి పండగలాంటి అప్డేట్.. ప్రభాస్ సరసన సాయి పల్లవి?

అంతేకాకుండా మిగతా ఏరియాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్తో రాణిస్తోంది. ఈ సినిమా ఇంకొన్ని రోజుల వరకు లాంగ్ రన్ లో నడిచే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. దాదాపు రూ.50కోట్లలోపు బడ్జెట్‍తోనే తెరకెక్కిన ఈ మూవీకి రూ.175.4 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

జనవరి 14న రిలీజైన ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ క్లబ్‌లో చేరింది. 20 రోజుల్లో రూ.173.1 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసి సత్తా చాటింది. ఈ వసూళ్లు ఎంత వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.