విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రేపు (జనవరి 14, 2025న) థియేటర్లోకి రానుంది. పొంగల్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి బజ్ ఉంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కామెడీ పక్కాగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉండటంతో బుకింగ్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి.
అయితే, ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం మూవీ OTT మరియు శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది. భారీ ధరకు జీ5 లాక్ చేసుకుందని సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాబోతుంది. అలాగే జీ తెలుగు టీవీ ఛానెల్‍కు శాటిలైట్ రైట్స్ కూడా దక్కాయి. రేపు థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు వచ్చే టాక్, కలెక్షన్స్ బట్టి మేకర్స్ ప్రీమియర్ డేట్ వెల్లడించే అవకాశం ఉంది.
ALSO READ | Daaku Maharaj: థియేటర్లో డాకు మహారాజ్ చూసిన నారా నందమూరి కుటుంబ సభ్యులు.. ఎక్కడంటే?
అయితే, అన్నీ కుదిరితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫిబ్రవరి థర్డ్ వీక్లో ఓటీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాకు కేవలం బుక్ మై షో వెబ్ సైట్ నుంచి దాదాపుగా 2 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. దీన్ని బట్టి ఈ సినిమాపై ఆడియన్స్కు ఏ రేంజ్లో బజ్ ఉందో అర్ధం చేసుకోవొచ్చు.