శ్రీశైలంలో సంబురంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబురాలు వైభవంగా నిర్వహించారు. రెండోరోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి బృంగి వాహనాదీశుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. 

 ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో బృంగి వాహనంలో ఆవహింపజేసి.. అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించారు. ప్రత్యేక హారతులిచ్చారు.  కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణ గావించారు.