వెలుగు ముషీరాబాద్: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ట్రెడిషనల్ వేర్లో స్టూడెంట్లు ఆడిపాడి సందడి చేశారు. హరిదాసుల వేషధారణలో ఆకట్టుకున్నారు. పల్లె శోభను తెచ్చేలా కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జోడెద్దుల సెట్టింగ్ స్పెషల్అట్రాక్షన్గా నిలిచింది.
సెల్ఫీలు, ఫొటోల స్పాట్‌గా నిలిచింది. సంబురాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గులు, గాలిపటాల పోటీల్లో స్టూడెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా నిర్వహించిన భోగి మంటల వేడుకలో టీచర్లు, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు. పిండి వంటలు చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.