మాదాపూర్​ శిల్పారామంలో గంగిరెద్దుల ఆటలు.. హరిదాసుల కీర్తనలు

  • మాదాపూర్​శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు షురూ

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, పిట్టల దొరలు, ఎరుకలసాని చేరుకున్నారు. గంగిరెద్దుల ఆటలు, విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. భోగి పండుగ సందర్భంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు చిన్న పిల్లలకు ‘భోగి పండ్ల ఉత్సవం’ నిర్వహిస్తున్నట్లు శిల్పారామం నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తి గల తల్లిదండ్రులు పిల్లలతో రావాలని కోరారు. మంగళవారం సంక్రాంతి సందర్భంగా స్పెషల్​ఈవెంట్స్​ఉంటాయని స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు తెలిపారు. చేనేత హస్తకళ, జానపద సంగీత, నృత్య కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామానికి రావాలని కోరారు.