
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలిరోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో పండుగ సందడి మొదలైంది. పలు ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. - వెలుగు నెట్వర్క్