- 13 నుంచి స్కూళ్లకు హాలీడేస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల11 నుంచి ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. శనివారం నుంచి ఈనెల 16 వరకూ కాలేజీలన్నింటికీ సెలవులు ఉంటాయని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలతో పాటు గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోని కాలేజీలకు హాలీడేస్ ఇవ్వాలని మేనేజ్మెంట్లను ఆయన ఆదేశించారు.
ఈ నెల 17న కాలేజీలు తెరుచుకోనున్నాయని వెల్లడించారు. మరోపక్క ఈ నెల 13 నుంచి17 వరకూ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.