వరంగల్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. జనవరి 9 నుంచి 15 వరకు.. వారం రోజుల్లో 16 కోట్ల 47 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో 2 కోట్ల ఆదాయం వస్తుండగా.. పండుగకు 14 కోట్లకు పైగా ఎక్కువ ఆదాయం వచ్చింది. 26 లక్షల 61 కిలోమీటర్ల మేర 26 లక్షల 42 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులు వినియోగించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 డిపోల పరిధిలో 927 ప్రత్యేక బస్సులు నడిపింది ఆర్టీసీ. మొత్తం ప్రయాణికుల్లో 16 లక్షల 30 వేల మంది మహిళలు ఫ్రీ టికెట్ తో ప్రయాణించారు. ఈ స్కీంతో ఆర్టీసీకి 7 కోట్ల 60 లక్షల ఆదాయం వచ్చింది. టికెట్లతో 8 కోట్ల 86 లక్షల ఆదాయం సమకూరింది.