Sankranti Special: సంక్రాంతి నోములు ఇవే.. కన్నె నోము ప్రత్యేకత ఏంటో తెలుసా..!

దీపావళి నోముల గురించి అందరికీ తెలుసుంటది. కానీ కొన్ని జిల్లాల్లో సంక్రాంతికి కూడా నోములు నోచుకుంటారనే విషయం తెలియకపోవచ్చు. కన్నె నోము, పెళ్లి నోము, పొట్ట గరిజెలు, బాలింత కుండలు అంటూ రకరకాలుగా ఉంటాయి. ఈ నోముల్ని పుట్టింటి వాళ్లు పట్టిస్తారు. కొన్ని చోట్ల అత్తింటివాళ్లకు ఉన్నా నోచుకుంటారు. ఈ నోమును మకర సంక్రాంతి రోజు నోచుకుంటారు. 

  • కన్నె నోములో.. చిన్న పిల్లల చేత పదమూడు బొమ్మలు, అద్దం, బొట్టు దగ్గరి నుంచి పెన్సిళ్ల వరకు చాలావాటితో నోము చేయిస్తారు. పూజ అయ్యాక వాటిని పదమూడు మంది ముత్తైదువులకు ఇచ్చి పంపుతారు. 
  • అలాగే పెళ్లి నోములో.. మంచం మీద బియ్యం పోసి, దంపతులతో పదమూడు గురుగులకు పూజ చేయిస్తారు. 
  • ఇక పొట్ట గరిజెలు అంటే.. గర్భిణుల చేత చేయించే నోము. ప్రసవం హాయిగా జరగాలని, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను కోరుకుంటారు. 13 జతల గరిజెలతో పూజ చేసి వాయినం ఇస్తారు. 
  • ఇక ప్రసవం తరువాత బాలింత కడవలు అనే నోము చేయిస్తారు. దీనికి ఐదుకుండలు (లేదా బిందెలు) గౌరమ్మ ముందు పెట్టి పూజ చేస్తారు.

ALSO READ | Sankranti Special : మకర సంక్రాంతిపై పురాణాల్లో ఏముందీ.. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏంటీ.. ఆచారం వెనక ఆరోగ్యం ఎలా..!