హైదరాబాద్: యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాయంత్రం కావడంతో సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరిగింది. హైదరాబాద్ సిటీ దాదాపుగా ఖాళీ అయ్యింది.
హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న నేషనల్ హైవేస్పై వాహనాల రద్దీపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ను తలపించాయి. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా.. సిటీ నుంచి పల్లెలకు వెళ్లే వాళ్లు అందరూ ఒకేసారి బయలుదేరటంతో జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది.
Also Read :- పంతంగి టోల్ గేట్ వరకు 5 కి.మీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై.. నేషనల్ హైవేపై 2025, జనవరి 11వ తేదీ సాయంత్రం వరకే 50 వేల వాహనాలు క్రాస్ అయినట్లు పంతంగి టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది చెబుతుంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి రాయలసీమకు వెళ్లే వాహనాలతో బెంగళూరు హైవే కూడా రద్దీగా మారింది.. ఈ రూట్లో 20 వేల వాహనాలు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఇక హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రహదారుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. ఓవరాల్గా హైదరాబాద్ సిటీ నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా లక్ష వాహనాలు సిటీ దాటి పల్లెలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ లక్ష వాహనాలూ కార్లు, ప్రైవేట్ వెహికల్స్ ఇవి కాకుండా ఆర్టీసీ రెగ్యులర్ బస్సులు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అదనంగా ఉన్నాయి.