చౌటుప్పల్, వెలుగు : విజయవాడ–హైదరాబాద్ హైవేపై వాహనాల రష్ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో హైవే మూడు రోజులుగా వాహనాలతో కిక్కిరిసిపోయింది. వాహనాల రద్దీ దృష్ట్యా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
పంతంగి టోల్ గేట్ లో 16 టోల్ వసూలు గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్లను ఓపెన్ చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల్లో లక్ష వాహనాలు వెళ్లినట్లు టోల్గేట్ నిర్వాహకులు తెలిపారు.