ప్రయాణికులతో ఖమ్మం, కొత్తగూడెం బస్టాండ్లు కిటకిట

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం బస్టాండ్​తోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లోని బస్టాండుల్లో ఊళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. శనివారం కిటికీల్లో నుంచే బ్యాగులు, పిల్లలను అందిస్తూ సీట్లు దొరికించుకునే ప్రయత్నం చేశారు.