సంక్రాంతి పల్లె..మనకోసమే మన ఊరికి పోయివద్దాం

రోజులు మారుతున్న కొద్దీ.. జనం పల్లెలు వదిలి పట్నాలకు వలస వస్తున్నారు. అరకొర ఉపాధి దొరికి కొంత ఊరట కలిగినప్పటికీ సొంతూళ్లను మిస్ అవుతున్న ఫీలింగ్ ఏదో మూలన ఉండక మానదు. 

అందుకే పండగలు, పబ్బాలు వచ్చిన్పప్పుడు సొంతూళ్లకు వెళుతుంటారు..దసరా, సంక్రాంతి, దీపావళి పండుగలను ఉళ్లకు వెళ్లి జోరుగా జరుపు కుం టారు. ముఖ్యంగా సంక్రాంతి లాంటి పెద్ద పండగ వచ్చిన ప్రతీసారి  అటు ఏపీ ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు సొంతూళ్ల బాట పడతారు. గత పల్లె జ్ణాపకాలను నెమ రు వేసుకుంటుంటారు.

చరిత్ర పుస్తకాల్లో చదివేది కాదు మన జీవితాలకి మూలం అని తెలియాలంటే ఊరికి దగ్గరలో ఉన్న పాత గడీ, కోటగోడ, పాతగుడి లాంటివి. మనం చిన్న నాడు చదువుకున్న స్కూల్, ఈతకొట్టిన పెద్ద బావి లాంటి ప్రదేశాలన్నీ పిల్లలతో మళ్ళీ ఓ రౌండేయ్యండి. 

పెంకుటిళ్ళూ, మట్టిగోడలూ దాటుతున్నప్పుడూ వాటిమీద దృష్టి పడేలా చెయ్యండి. ఒకప్పుడు మనం తిరిగిన పల్లె ఎలా మారిపోతోందో ఒకసారి గుర్తు చేసుకోండి. మన ఊరి అభివృద్ధి కోరుకుంటూనే పాత జ్ఞాపకాలలో అలా ఒక నోస్టాల్జియాని దాచుకొని 3) మళ్ళీ మళ్ళీ పట పట్నం బస్సెక్కి వచ్చేయండి. 

అప్పుడప్పుడూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవటం ఇప్పుడు వినటానికి చికాకుగా ఉన్నా గుర్తు చేసుకున్నప్పుడు బాగుంటుంది..... అదే కాదు ఒక్కసారి పిల్లలకి ఇవన్నీ చూపించాక వాళ్ళ ఆలోచనా తీరు ఎలా మారిపోతుందో మీరే గమనించొచ్చు. 

ALSO READ : సంక్రాంతి దేనికి ప్రతీక.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

ఏదో పనిమీద ఊరికి వెళ్ళిరావటంలాగా కాదు, పండక్కి కనీసం మూడు రోజులు వెళ్తాం. కాబట్టి ఈసారి మనకోసమే మనం ఊరికి పోయివద్దాం... కొన్ని సార్లు మనల్ని మనం వెతుక్కున్నట్టు ఊరిని చూడటం ఎంత బాగుంటదో ఈ సారి ట్రై చేద్దాం... ఊరి జీవితం ఇప్పుడు నోస్టాల్జియా కావచ్చు. కానీ, అది మనలో ఎప్పటికీ మిగిలిపోయే మన బతుకు కదా!