‘ఆదర్శ గ్రామాలు’.. సగమే

‘ఆదర్శ గ్రామాలు’.. సగమే

మోడీ సర్కారు ప్రకటిం చిన మంచి పథకాల్లో ‘సంసద్ ఆదర్శ్​ గ్రామ్ యోజన’ కూడా ఒకటి. పేరుకు తగ్గట్లే ఆ స్కీమ్ ఆదర్శవంతంగా ప్రారంభమైంది. తొలి దశ లో ఏకంగా 703 మంది ఎంపీలు తలో గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చటానికి ముందుకొచ్చారు. అయితే.. రెం డు, మూడు విడతల్లో ఈ మోడల్ ప్రోగ్రామ్ డల్ అయింది. మూడో దఫాలో కనీసం 300 మంది ఎంపీలు కూడా కార్యక్రమం అమలు పట్ల ఆసక్తి చూపలేదు. దీం తో ఈ పథకం ఇప్పటివరకు 52 శాతం లక్ష్యాన్నే చేరగలిగింది.

మోడీ 2014 మేలో ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మూడు నెలల తర్వాత అంటే ఆగస్టు 15న పీఎంగా తన తొలి ఇండిపెండెన్స్​ డే స్పీచ్​లో ‘సంసద్​ ఆదర్శ్​ గ్రామ్​ యోజన’(ఎస్​ఏజీవై)పై ప్రకటన చేశారు. అదే ఏడాది అక్టోబర్​ 11న పథకాన్ని ప్రారంభించారు. రాజ్యసభ, లోక్​సభ సభ్యులు రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరు మూడు గ్రామాల చొప్పున సెలెక్ట్​ చేసుకొని ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​ చేసి మోడల్​ విలేజ్​లుగా మార్చాలని కోరారు.

ఆరంభం అదిరింది

ప్రధాని ఇచ్చిన పిలుపు​కి పార్లమెంట్​ సభ్యుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. లోక్​సభ ఎంపీలు తమ సెగ్మెంట్​ పరిధిలో, రాజ్యసభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాలో… బాగా వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. లోక్​సభలోని 543 మంది సభ్యుల్లో 500 మంది, రాజ్యసభలోని 245 మంది ఎంపీల్లో 203 మంది (మొత్తం 703 మంది సభ్యులు) ప్రారంభ దశలో పల్లెలను ఎంపిక చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

దీంతో కేంద్రం ఈ పథకం అమలు పట్ల భారీ అంచనాలు పెట్టుకుంది.  ‘గౌరవ పార్లమెంట్​ సభ్యులు దేశవ్యాప్తంగా 1,475 గ్రామ పంచాయతీలను అన్ని విధాలా డెవలప్​ చేసేందుకు దగ్గరుండి మరీ సలహాలు సూచనలు ఇస్తున్నారు’ అని రూరల్​ డెవలప్​మెంట్​ మినిస్ట్రీ ఆ మధ్య గొప్పగా చెప్పుకుంది. ‘స్టేట్​ పెర్ఫార్మెన్స్​ అండ్​ యాక్షన్ ప్లాన్​ రిపోర్ట్’​లో తెలిపింది.

పాటించాల్సిన రూల్స్​

ఎస్​ఏజీవైలో ప్రతి ఎంపీ 2016 నాటికి ఒక గ్రామాన్ని, 2019లోపు మరో రెండు ఊళ్లను, 2024 నాటికి ఇంకో ఐదు పల్లెలను దత్తత తీసుకొని ప్రగతి బాట పట్టించాలి. పార్లమెంట్​ సభ్యులు తమ ఇష్టమొచ్చిన విలేజ్​లను ఈ మేరకు ఎంపిక చేసుకోవచ్చు. అయితే సొంతూరును గానీ, అత్త గారి గ్రామాన్ని గానీ సెలెక్ట్​ చేసుకోకూడదు  ఈ స్కీమ్​కి ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు. వివిధ పథకాలకు కేటాయించిన బడ్జెట్​నే వాడుకొని పనులు పూర్తి చేయాలి.

50 శాతానికే పరిమితం

ఎస్​ఏజీవై పట్ల రెండో విడతలో 497 మంది ఎంపీలు, మూడో దఫాలో 283 మందే ఆసక్తి చూపారు. ఒక దశలో అధికార బీజేపీ ఎంపీలు, మోడీ కేబినెట్​ మంత్రులు కూడా ఈ స్కీమ్​​ను పట్టించుకోలేదు. ప్రధాని మాత్రం మూడు ఫేజుల్లో మూడు గ్రామాలు దత్తత తీసుకున్నారు. రూరల్​ డెవలప్​మెంట్​ మినిస్ట్రీ డేటా ప్రకారం ఈ పథకంలో 35 శాతం ప్రాజెక్టులు ప్రారంభమే కాలేదు. 13 శాతం పనులు కొనసాగుతున్నాయి. దీన్నిబట్టి ఇప్పటివరకు 52 శాతం గ్రామాలే మోడల్​ విలేజ్​లుగా మారాయని చెప్పొచ్చు.

బెంగాల్, ఒడిశా వరస్ట్

​ కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అద్భుతంగా అమలుచేస్తుండగా మరికొన్ని మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. యూపీ (90 శాతం),ఉత్తరాఖండ్ (85 శాతం), తమిళనాడు (80శాతం), గుజరాత్ (76 శాతం పనులతో) ‘దిబెస్ట్’గా నిలిచాయి. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ అధికారంలో ఉన్న పశ్చిమ బెం గాల్ 100 శాతం ఈపథకాన్ని పట్టించుకోలేదు. ఆ రాష్ట్రానిది వరస్ట్ పెర్ఫార్మెన్స్ . నవీన్ పట్నాయక్ లీడర్ షిప్ లోని ఒడిశాలో 76 శాతం ప్రాజెక్టుల్లో అడుగుముందుకు పడలేదు. దీంతో ఎస్ఏజీఐ టార్గెట్ చేరుతుందా అనే డౌట్లు వస్తున్నాయి