
హైదరాబాద్ సిటీ, వెలుగు: వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో సంస్కార్ వేసవి శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 28) జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల్లో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. రామకృష్ణ మఠం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు, యువకులు జాతి నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన కిమ్స్ హాస్పిటల్ సీఎండి భాస్కరరావు మాట్లాడుతూ.. జీవితంలో క్రమశిక్షణకు చాలా ముఖ్యమని తెలిపారు. రామకృష్ణ మఠం వాలంటీర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.