మెదక్ జిల్లాలో ఘనంగా సంత్​గాడ్గే బాబా జయంతి

మెదక్ జిల్లాలో ఘనంగా సంత్​గాడ్గే బాబా జయంతి

మెదక్​టౌన్, వెలుగు: స్వచ్ఛ్​భారత్​సృష్టికర్త సంత్ గాడ్గే బాబా149వ జయంతిని శుక్రవారం జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మెదక్  మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి విగ్రహం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.

 అనంతరం స్థానిక మడేలేశ్వర దేవాలయం ప్రాంగణంలోని  సంత్ గాడ్గే బాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు మల్లేశం, జిల్లా యూత్ అధ్యక్షుడు విజయ్ కుమార్, జిల్లా నాయకులు నాగరాజు, వేణు, సిద్దిరాములు, పోచన్న, శేఖర్, శ్రీనివాస్, గణేశ్, మల్లయ్య, మహిపాల్, ప్రవీణ్, కిరణ్ పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్: సంత్ గాడ్గే బాబా149వ జయంతిని శుక్రవారం సంగారెడ్డిలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ  ప్రజలను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి సంత్​గాడ్గే అన్నారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు వేణు, ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్, రజక సంఘాల సమితి అధ్యక్షుడు నామాల నగేశ్, రాజు, యాదయ్య పాల్గొన్నారు.