ఆదర్శప్రాయుడు సేవాలాల్​ మహారాజ్​

ఆదర్శప్రాయుడు సేవాలాల్​ మహారాజ్​

కామారెడ్డి టౌన్​, వెలుగు :సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, ఆర్డీవో కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి నర్సింహులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. 

 గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..

నిజామాబాద్, వెలుగు:  గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు.  వినాయక్​నగర్​లోని సేవాలాల్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు,  నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్​, ఎస్టీ వెల్ఫేర్​ ఆఫీసర్​ నాగూరావు తదితరులు పాల్గొన్నారు.